నాటే వాళ్లకు అడిగినన్ని మొక్కలు

May 15, 2021

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ). అందుకు చేయాల్సిందల్లా కేవలం ఒక ఫోన్ కాల్. జీవవైవిధ్య విభాగం అధికారులకు ఫోన్‌చేస్తే ఉచితంగా మొక్కలు అందజేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇలా ఉచితంగా 35 లక్షల మొక్కలను అందించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. మీ ఇష్టం వచ్చిన మొక్కలు తీసుకెళ్లి నాటుకొనే అవకాశం కల్పిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రస్తుత 2018-19 సంవత్సరం హైదరాబాద్‌లో 40 లక్షల మొక్కలను నాటాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా నిర్ణయించింది. వీటిలో 5 లక్షల మొక్కలను నగరంలో ఖాళీ స్థలాలు , వివిధ సంస్థల కార్యాలయాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో నాటాలని, మిగిలిన 35 లక్షల మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నగరంలో ఎన్ని నర్సరీలున్నాయి, ఏ నర్సరీలో ఏ రకమైన మొక్కలున్నాయనే వివరాలతోపాటు, సంప్రదించాల్సిన అధికారులు, వారి మొబైల్ నంబర్లతో సహా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ http;greenhyderabad.cgg.gov.in లో పొందుపర్చారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *