నవ్వే తీసింది ప్రాణం..!

May 15, 2021

నవ్వు నానా విధాల చేటు అంటారు. ఆ నవ్వెనే ఒక యువకుడి ప్రాణం తీసింది. చెన్నై చెంబియం పళని ఆండవర్‌ ఆలయం వీధిలో దురై అనే వ్యక్తి వీఎస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ నడుపుతున్నాడు. జయప్రకాష్‌ (20) అనే యువకుడు రెండు రోజుల క్రితం పనిలో చేరాడు. పెరంబూరులో నివసించే తన తమ్ముడు రాజేష్‌ (25)ను ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్‌ బాధ్యతలు అప్పగించి ఊరెళ్లిన దురై రెండు రోజుల క్రితం చెన్నైకి చేరుకున్నాడు.

కసిగా శవం పక్కనే పడుకొని..

సరిగా వ్యాపారం చూసుకోలేదమని తమ్ముడిని దురై తిడుతుండగా ఫాస్ట్‌ఫుడ్‌లో పనిచేస్తున్న జయప్రకాష్‌ తన స్నేహితుడు అర్జున్‌ అనే వ్యక్తితో కలిసి చూస్తూ నవ్వాడు. వీరిద్దరూ నవ్వడాన్ని చూసి తీవ్ర ఆగ్రహం చెందిన రాజేష్‌ రాత్రి నిద్రపోతుండిన జయప్రకాష్‌ మెడకు తన ప్యాంటుకున్న బెల్టును బిగించి ప్రాణాలు తీశాడు. రాత్రంతా శవంపక్కనే పడుకుని నిద్రించి తన కసి తీర్చుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *