దేవుని హుండీనే దోచుకెళ్లారు..!

May 15, 2021

జగిత్యాల జిల్లాలోని అంబారిపేట గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. ఏకంగా దేవుడి హుండీలనే ఎత్తుకెళ్లారు దుండగులు. హుండీలను పగులగొట్టి వాటిలో ఉన్న సుమారు రెండు లక్షల రూపాయలు, 20 తులాల వెండి, రెండు తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం అనంతరం దొంగలు దేవుడి హుండీలను అక్కడే వదిలేసి పారిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *