థాయ్ విషాదం.. వైరలైన చిత్రం

May 15, 2021

థాయ్ గుహ ఆపరేషన్ ముగిసినప్పటికీ విషాదం వెంటాడుతూనే ఉంది. బాలలను సురక్షితంగా రక్షించినప్పటికీ ఆపరేషన్ లో ఒక అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ

ఒక్క విషాదం థాయ్ నౌకాదళానికి చెందిన మాజీ అధికారి సమన్ కునన్ (38) మరణం. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి రెండురోజుల ముందు ఆక్సిజన్ ట్యాంక్‌లను గుహలో పెట్టడానికి వెళ్లిన సమన్ తిరిగి వస్తుండగా ఊపిరాడక అక్కడే మరణించారు.నువ్వే నా ప్రాణం..సమన్ భార్య వలీపోన్ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను. నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం. ఇక నేను ఉదయాన్నే లేచి ఎవరిని చూడాలి? నీ వెచ్చని కౌగిలి నాకు మళ్లీ కావాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.వైరల్ గా పోస్ట్..భర్తతో కలిసి దిగిన ఫొటోను కూడా ఆ పోస్ట్‌కు జతచేశారు. తన భర్త చనిపోవడానికి గుహలో చిక్కుకున్న చిన్నారులు కారణం కాదని, వారిని ఎవరూ నిందించవద్దని ఆమె కోరారు. ఆమె పోస్ట్ చేసిన ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. మీ భర్త ధైర్యవంతుడు, ఆయన సాయాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం. ధైర్యంగా ఉండండి అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. లువాంగ్ గుహ వద్ద సమన్ విగ్రహాన్ని నెలకొల్పుతానని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ చిత్రకారుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *