థాయ్ గుహా ఆపరేషన్ సక్సెస్..

May 15, 2021

థాయ్‌లాండ్‌లోని ఓ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది చిన్నారులు, ఒక కోచ్ లో ఆరుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. 13 మంది విదేశీ, ఐదుగురు స్వదేశీ డైవర్లతో కూడిన రెస్క్యూ టీం ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆరుగురు బాలలను హెలికాప్టర్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఆరుగురిని వెంటనే అంబులెన్స్ లలో చియాంగ్ రాయ్ సిటీలోని ఆస్పత్రికి తరలించామని అక్కడి ప్రతినిధి ఒకరు తెలిపారు.

రెండు వారాల కిత్రం 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్ కోచ్‌ గుహలోకి వెళ్లిన తర్వాత భారీగా వరదలు రావడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 9 రోజుల తర్వాత వాళ్లను ఇద్దరు బ్రిటిష్ డైవర్లు కనుగొన్నారు. ఇప్పుడు వాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *