తిరుమలలో భక్తుల రద్దీ

May 15, 2021

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. అంతేకాకుండా బయట వైకుంఠం వెలుపల భక్తులు కిలోమీటర్ మేర బారులు తీరారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్‌స్లాట్ పొందిన భక్తులకు 3 గంటల్లోపు సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని నిన్న 92,645 మంది భక్తులు దర్శించుకున్నారు. 47,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.78 కోట్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *