తానికాయతో అనారోగ్య సమస్యలకు చెక్

May 15, 2021

ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాల వల్ల అనారోగ్యాలు సంభవిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే మనకు రోగాలు వస్తుంటాయి. అయితే కఫ దోషం వల్ల కలిగే అనారోగ్యాలకు మాత్రం తానికాయలు బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థలలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తానికాయలు నయం చేస్తాయి. తానికాయల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తానికాయ చూర్ణం, చక్కెరలను ఒక్కోటి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని తినాలి. రోజూ ఇలా చేస్తే కంటి చూపు మెరుగు పడుతుంది.

2. తానికాయ చూర్ణం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి కొద్దిగా తేనె కలిపి తింటే గొంతులో నొప్పి, మంట తగ్గుతాయి. గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది. కంఠస్వరం తిరిగి వస్తుంది.

3. తానికాయ గింజల పప్పును రాత్రి పూట తింటే నిద్ర చక్కగా పడుతుంది.

4. తానికాయల చూర్ణం 10 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి రెట్టింపు మోతాదులో తేనె కలిపి సేవించాలి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

5. శరీరం మంటగా ఉంటే తానికాయ గింజల పప్పును నూరి శరీరానికి రాసుకోవాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. తానికాయల చూర్ణం 3 గ్రాములు, 7 గ్రాముల పాత బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

7. తానికాయ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, పాత బెల్లం సమాన మోతాదుల్లో తీసుకుని రోజూ సేవిస్తుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *