డిఎస్పీకి కాదు.. కానిస్టేబుల్ కే అర్హురాలు

May 15, 2021

భారత మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ హోదా మారబోతున్నది. నకిలీ డిగ్రీ ధృవపత్రాలు సమర్పించిన కారణంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) నుంచి కానిస్టేబుల్ ఉద్యోగానికి మార్చేందుకు పంజాబ్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కౌర్‌ను పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో గౌరవించింది.

అయితే మీరట్‌లోని చౌదరీ చరణ్‌సింగ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందినట్లు కౌర్ సమర్పించిన సర్టిఫికెట్లపై పంజాబ్ పోలీసులు జరిపిన దర్యాప్తులో నకిలీవని తేలాయి. ఆమె గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు నకిలీవిగా గుర్తించాము. ఆమె క్రికెట్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డిగ్రీ పట్టాను పరిగణనలోకి తీసుకోకుండా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఆధారంగా కానిస్టేబుల్ పోస్ట్‌కు అర్హురాలుగా భావిస్తున్నాం. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కౌర్..పోస్టింగ్‌పై నిర్ణయం తీసుకుంటాం అని సీనియర్ పోలీస్ అధికారి అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *