జైలులోనే గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థి

May 14, 2021

మాఫియా డాన్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జైలులో ఈ రోజు ఉదయం ఆయన ప్రత్యర్థి చేతిలో హత్యకు గురయ్యాడు. అదే జైలులో ఉన్న మరో గ్యాంగ్ స్టర్, ప్రత్యర్థి అయిన సునీల్ రాఠీ అతి సమీపం నుంచి తుపాకీ తో కాల్చి చంపాడు. మున్నాను కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

ప్రాణహాని ఉందని చెప్పిన భార్య..

మున్నా భార్య సీమ ఇటీవల మాట్లాడుతూ తన భర్తకు ప్రాణహాని ఉందని, యూపీ పోలీసుల హిట్ లిస్ట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. తూర్పు యూపీకి చెందిన మున్నాను ఓ కేసు నిమిత్తం ఝాన్సీ జైలు నుంచి శనివారం భాగ్‌పట్ జైలుకు తరలించారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థి సునీల్ రాఠీ చేతిలో మున్నా హత్యకు గురయ్యాడని జైళ్ల శాఖ అదనపు ఐజీ శరద్ తెలిపారు. జైలులోకి తుపాకి ఎలా వచ్చిందన్నదానిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *