జమిలి ఎన్నికలపై వైసీపీ క్లారిటీ

May 13, 2021

జమిలి ఎన్నికల నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర లా కమిషన్ ను కలిసి తమ అంగీకారాన్ని తెలియజేవారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… జమిలి ఎన్నికల నిర్వహణ దేశానికి మేలు చేసేదే అని, కానీ, ఇందులో ఉన్న కొన్ని సమస్యలను లా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే జమిలి ఎన్నికల ద్వారా దేశానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం ఒక్కసారి మినహా ఎప్పుడైనా కేంద్రంతో సహా ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు జరుగుతున్నాయని, కాబట్టి, జమిలి ఎన్నికలకు తమ పార్టీకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుతుంది, అవినీతి తగ్గుతుందని, ఓటుకు నోటి కేసు వంటివి రావని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *