గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత..కోమటిరెడ్డి అరెస్ట్‌

May 15, 2021

గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం భారత్‌ బచావో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర కార్యకర్తలు చలో ప్రగతి భవన్‌ అంటూ రోడ్డు మీదకు దూసుకువచ్చారు. కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గాంధీభవన్‌ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొని, భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. అరెస్ట్‌ చేసిన వారికి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కేటీఆర్‌కు అధికార మదం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాటిచ్చి మరిచిపోయారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారత్‌ బచావో ఆందోళన కార్యమంలో సోమవారం ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ సోనియా గాంధీని అమ్మా.. బొమ్మా అని అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావటానికి యువత నడుం కట్టాలన్నారు. తెలంగాణలోని యువ నాయకులు, యువజన కాంగ్రెస్‌ నాయకులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. అక్రమ కేసులు పెట్టిన అధికారులు పేర్లు రాసిపెట్టుకోండని, వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరి సంగతి తేల్చుదామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *