క్యారెట్ జ్యూస్ లోనే ఎక్కువ పోషకాలు..

May 15, 2021

క్యారెట్లు తియ్యగా ఉంటాయి కనుక పచ్చిగా ఉన్నా సరే వాటిని పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగానే తింటారు. ఇక వాటిని కొందరు కూరగా చేసుకుని తింటారు. కొందరు అలాగే తింటారు. కానీ రోజూ క్యారెట్లను జ్యూస్‌గా చేసుకుని తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. క్యారెట్లలో ఉండే పోషకాలు మన శరీరానికి బాగా మేలు చేస్తాయి. క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. దృష్టి సమస్యలు పోతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2. రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

3. ధూమపానం చేసే వారు క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగితే ధూమపానం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు.

4. క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ తగ్గుతుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

5. క్యారెట్లలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

6. క్యారెట్లలో విటమిన్ బి6, కె, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి.

7. అసిడిటీని తగ్గించడంలో క్యారెట్ జ్యూస్ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్దకం ఉండదు. శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

8. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యారెట్లు ఎంతగానో పనికొస్తాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలు శుభ్రం అవుతాయి. కిడ్నీలపై ఒత్తిడి తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *