కొత్త 100 నోటుపై ఏముందో తెలుసా..?!

May 13, 2021

భారత రిజర్వ్ బ్యాంక్ విడుద‌ల చేసిన కొత్త 100 నోటుకు ప్రత్యేకత ఉంది. నోటుపై “రాణి కి వావ్” ను మోతీఫ్ గా ప్రచురించారు. ఇంత‌కీ “రాణి కి వావ్” ప్ర‌త్యేక‌త ఏంటి? అది ఎక్క‌డ ఉంది? దాని చ‌రిత్రేనే ఉందని చెప్పవచ్చు.

11వ శతాబ్దం నాటి బావి..

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు. ఇది ఆనాటి కాలంలోనే భార‌తీయుల టెక్నాల‌జీకి తార్కాణంగా నిలిచింది…. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన ఈ మెట్ల‌బావి ఓ అద్భుతం.!

తొమ్మిది వందల ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా త‌వ్వ‌కాలు చేప‌ట్టి …. మ‌ట్టికొట్టుకుపోయిన క‌ట్ట‌డాన్ని పున‌రుజ్జీవనంలోకి తెచ్చారు.!

నిర్మాణం ఓ అద్బుతం..

ఈ బావి పొడ‌వు 209 అడుగులు, వెడ‌ల్పు 65 అడుగులు , లోతు 88 అడుగులు..చూడ‌డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు దశవతారాలు క‌నిపిస్తాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *