కాంగ్రెస్‌కు షాక్… టీఆర్ఎస్‌కు జోష్

May 13, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అవిశ్వాసం నెగ్గించుకోవడానికి అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కౌన్సిలర్ల ఫిరాయింపులను ప్రోత్సహించడంతో మునిసిపల్‌లో రాజకీయ సమీకరణల్లో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కౌన్సిలర్లను కూడగట్టుకోవడంలో అధికార టీఆర్‌ఎస్‌ సఫలీకృతం కాగా.. అవిశ్వాసంపై తటస్థ వైఖరిగా ఉన్న కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించడంపై ఖంగుతిన్నారు. భువనగిరి అవిశ్వాస రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులతో కౌన్సిల్‌లో పార్టీల బలాబలాలు కూడ పెద్ద ఎత్తున మారిపోయాయి. మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ చిహ్నంపై ఒక్క కౌన్సిలర్‌ సైతం గెలవని టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 18కి చేరగా.. 8మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు మాత్రమే మిగిలారు. టీడీపీ నుంచి గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 8మంది గెలిచిన బీజేపీలో నుంచి ఇప్పటి వరకు చైర్మెన్‌, మరో కౌన్సిలర్‌ అధికార టీఆర్‌ఎ్‌సలో చేరినప్పటికీ.. తర్వాత రాజకీయ పరిణామాలతో వారిద్దరు సొంతగూటికి చేరుకోవడంతో వారి బలం అదేవిధంగా ఉంది. సీపీఎం నుంచి గెలిచిన ఒకే ఒక కౌన్సిలర్‌ అదే పార్టీలో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *