ఏసీబీకి చిక్కిన ఏఈ

May 15, 2021

జిల్లాకు చెందిన వేములపల్లి ఏఈ శ్రీధర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని తన నివాసంలో శ్రీధర్‌రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు, లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, ఇవ్వాలని డిమాండ్ చేసినా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *