ఉద్యోగాల పేరుతో భారీ మోసం

May 15, 2021

సచివాలయంలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. శనివారం ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సచివాలయం రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిందితుడు బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. నకిలీ ఆర్డర్ కాపీతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన కూకట్‌పల్లికి చెందిన నాగరాణి అనే మహిళ సచివాలయానికి వచ్చింది. నకిలీ ఆర్డర్‌గా గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరికి ఆమెను రెవెన్యూ శాఖ అధికారులు తీసుకెళ్లారు. చీఫ్ సెక్రటరీ పేరుతో ఒకే ఆర్డర్‌లో 22 మందికి ఉద్యోగాల కాపీని గుర్తించారు. సీఎస్ ఆదేశాలతో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోసం చేసిన వ్యక్తి కూకట్‌పల్లికి చెందిన ప్రేమ్‌సాగర్‌గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *