ఇంట్లోనే మహిళపై కాల్పులు

May 14, 2021

బందిపొరా జిల్లాలోని హజిన్ ఏరియా షాగుండ్ గ్రామంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. పీడీపీ నేతలతో కలిసి పనిచేస్తున్న అబ్దుల్ మజిద్ దార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఇవాళ ఉదయం ఇద్దరు తీవ్రవాదులు చొరబడ్డారు. అబ్దుల్ భార్య షకీలా బేగంపై కత్తులతో దాడి చేసి అనంతరం ఆమె గొంతు కోశారు. తీవ్రగాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *