ఆ సమాధిలో 38 మానవ అస్థిపంజరాలు

May 15, 2021

సమాధి అంటేనే భయపడి పోతాం. ఒక సమాధిలో ఉంటే ఒకటే అస్థిపంజరం ఉండాలి. దీనికి భిన్నంగా

శ్రీలంకలో సామూహిక సమాధి బయటపడింది. ఈశాన్య శ్రీలంక ప్రాంతంలోని మన్నార్‌లో గుర్తించిన భారీ సమాధిలో 38 మానవ అస్థిపంజరాలున్నాయి. మన్నార్‌లో బేస్‌మెంట్ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా అండర్‌గ్రౌండ్ లో సమాధి ఉన్నట్లు తెలిసింది. అస్థిపంజరాలు 2019లో ప్రభుత్వ దళాలకు, తమిళ్ టైగర్ రెబల్స్‌కు మధ్య జరిగిన యుద్ధంలో చనిపోయిన వారివిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

అంతర్యుద్ధం నాటివేనా..

1983-2009 మధ్య శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో మన్నాన్ పట్టణం ఎల్‌టీటీఈ ఆధీనంలో ఉందని అధికారులు తెలిపారు. మాజీ దేశాధ్యక్షుడు మహింద రాజపక్సే ప్రభుత్వ హయాంలో 40 వేల మంది తమిళ పౌరులు చంపబడ్డట్లు అంతర్జాయతీయ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *