అన్నింట్లో వేగం… అందుకే రాష్ట్రపతి అవార్డు!

May 15, 2021

 

ఈమె పేరు టీనా దాబి. 2016లో యూపీఎస్‌సీ టాపర్‌గా నిలిచిన ప్రతిభావని. దిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్సులో పట్టా అందుకున్న టీనా మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ప్రథమ ర్యాంకు సాధించింది. అదే సంవత్సరం రెండో ర్యాంకు సాధించిన అథూర్‌ ఉల్‌ షఫీని ప్రేమ వివాహం చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ట్రైనీ ఐఏఎస్‌గా రాజస్థాన్‌లో పనిచేస్తోంది. లింగ వివక్షా, మహిళాసాధికారత మీద దృష్టి పెట్టింది. రెండేళ్ల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న టీనా విద్యార్థినిగా, ట్రైనీగా విధుల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. ప్రతి నిర్ణయం వేగంగా తీసుకోవడం… ప్రజలకు చేరువగా ఉండి వాళ్ల సమస్యల్ని తెలుసుకోవడం.. ఇలా టీనా అన్నింటా తనేంటో నిరూపించుకుంది. అందుకే తాజాగా రాష్ట్రపతి నుంచి బంగారు పతకం అందుకుంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *